ఆసియా కప్ 2023 కోసం నేడు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇందులో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు కల్పించలేదు. దీంతో ఆసియా కప్‌లో భారత్ తరఫున ఆడాలన్న యుజీకి నిరాశే ఎదురైంది. అంతేకాదు దాదాపు ఇదే జట్టును వన్డే వరల్డ్ కప్‌కు సైతం కొనసాగిస్తారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో వరల్డ్ కప్‌లో ఆడాలన్న యుజ్వేంద్ర చాహల్ కల నెరవేరుతుందా లేదా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ఇటీవల వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తాచాటిన చాహల్‌కు చోటు కల్పించకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పలువురు మాజీలు సైతం చాహల్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. చాహల్ కూడా తనను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
ఆసియా కప్‌లో తనకు చోటు దక్కుతుందని ఎంతోగానో బావించాడు చహల్. అయితే.. తన ఆశ నిరాశ కావడంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఎవరిని ఎలాంటి మాట అనలేదు.. సరికదా ఎటువంటి పదాలు రాయకుండే రెండంటే రెండు ఎమోజీలతో కూడిన ఓ ట్వీట్ ను చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటీజన్లు అతడికి మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ చహల్ ఏం పోస్ట్ చేశాడంటే..? మబ్బుల చాటున దాగిఉన్న సూర్యుడు ఎమోజీతో పాటు మబ్బులు తొలగిన తరువాత ప్రకాశిస్తున్న సూర్యుడి ఎమోజీలను పోస్ట్ చేశాడు. సూర్యుడి ప్రకాశాన్ని ఎవ్వరూ ఆపలేరు. మబ్బులు కొంతసేపే ఆపగలవు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశాడు. త్వరలోనే నీకు మంచి రోజులు వస్తాయి అంటూ నెటీజన్లు అతడికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. కమ్ బ్యాక్ స్ట్రాంగ్, మబ్బుల చాటు నుంచి మళ్లీ ఉదయిస్తావు చాహల్ అంటూ మరికొందరు పోస్టులు చేస్తున్నారు. చెస్‌లో అండర్-12 విభాగంలో జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచిన చాహల్.. తన దైన శైలిలో స్పందించాడని పేర్కొంటున్నారు.
చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్ కూడా చేయగలడని.. కుల్‌దీప్ యాదవ్ మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడని అందుకే వారిని ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలిపాడు. చాహల్‌కు వన్డే వరల్డ్ కప్ డోర్లు ఇంకా తెరిచే ఉన్నాయని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.