ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం నిధులను నేడు విడుదల చేయనున్నారు. విజయవాడ విద్యాధర పురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు,ఎండీయూ ఆపరేటర్లకు ఆర్ధిక సాయం అందించనున్నారు. 2 లక్షల 75 వేల 931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ తదితర అవసరాల కోసం వీటిని ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 10.30 గంటలకు కంప్యూటర్ బటన్ నొక్క మొత్తం 275.93 కోట్ల నిధులను సీఎం విడుదల చేయనున్నారు. నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డ్రైవర్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రూ. 10 వేలు విడుదల చేయనున్నారు.
2019 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ సాయాన్ని లబ్ధిదారులకు అందజేసింది. ఇప్పుడు ఐదో విడత సాయాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 29న కాకినాడలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan) ఈ నిధులను విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 10 వేలు జమచేయనున్నారు. ఈనెల 29 జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ శ్రుతి శుక్లా పరిశీలించారు. ఇతర ఉన్నతాధికారులు కూడా హెలి ప్యాడ్, బహిరంగ సభ జరిగే ప్రదేశాల్లో ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఇంకా 6 రోజులే సమయం ఉండే ఉండటంతో ఎలాంటి లోటు పాటు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ(YSRCP) శ్రేణులు పెద్దఎత్తున తరలి రావాలని ఆ పార్టీ నాయకులు సూచించారు.