ఉత్తర్ ప్రదేశ్(UTTAR PRADESH) సీఎం(CM) యోగి ఆదిత్యనాథ్(YOGI ADITYANADH) ఫాలోయింగ్(FOLLOWING) మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఎక్స్(TWITTER)లో యోగి సంచలనం సృష్టించారు. గడిచిన 30 రోజుల్లోనే ఆయనకు 2.67 లక్షల మంది కొత్త ఫాలోవర్లు(FOLLOWERS) పెరిగారు. ఎక్కువ మంది కొత్త ఫాలోవర్లను సంపాదించుకున్న రాజకీయ నాయకుల్లో(POLITICAL LEADERS) ప్రధాని నరేంద్రమోడీ మొదటిస్థానంలో ఉన్నారు. ప్రధాని మోడీ(PRIME MINISTER)కి 30 రోజుల్లో 6.32 లక్షల మంది కొత్త ఫాలోవర్లు(NEW FOLLOWERS) పెరిగారు.
ఎక్స్ లో యోగి ఆదిత్యనాథ్ కి మొత్తంగా 26 మిలియన్లు (2,59,81,782)మంది అనుచరులు ఉన్నారు. గత 30 రోజుల్లో ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తులు, సంస్థల జాబితాను ఎక్స్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఇండియాలోని రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్రమోడీ మొదటి స్థానంలో ఉంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండోస్థానంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) మూడోస్థానంలో ఉన్నారు. ఫాలోవర్లను పెరుగుదల రాహుల్ తో పోలిస్తే యోగికే అధికంగా ఉంది. భారతదేశంలో ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ కి సోషల్ మీడియాలో ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. మొత్తంగా చూస్తే కొత్త ఫాలోవర్లను సంపాదించుకోవడంతో ఇస్రో (11,66,140) తొలిస్థానంలో ఉంటే, ప్రధాని మోడీ రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ (4,74,011) మూడోస్థానంలో వీరి తర్వాత నాలుగో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.