Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ YCP Leaders Comments On Chandrababu: దోచుకోవడంలో చంద్రబాబు నెంబర్.1

YCP Leaders Comments On Chandrababu: దోచుకోవడంలో చంద్రబాబు నెంబర్.1

by స్వేచ్ఛ
0 comment 56 views
RK ROJA AND MARGANI BHARATH FIRES ON CBN

ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH) రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు(CHANDRABABU) అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి(MINISTER) ఆర్కే రోజా(RK ROJA).. తిరుపతి(TIRUPATHI)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఎలా దొచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్టా అని అభివర్ణించారు. సినిమాల్లో కలెక్షన్ కింగ్(COLLECTION KING) గా మోహన్ బాబు(MOHAN BABU)కు పేరు ఉంటే.. దోచుకోవడంలో కలెక్షన్ కింగ్ గా చంద్రబాబు ఉన్నాడని దుయ్యబట్టారు. అయితే, చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసుల(IT NOTICES)పై టీడీపీ(TDP) నేతలు ఎందుకు నోరువిప్పరు? అని నిలదీశారు. చంద్రబాబు(CHANDRABABU), లోకెష్(LOKESH) అవినీతి అక్రమాలపై సీబీఐ(CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్(SRINIVAS) ఇంట్లో వేల కోట్ల అక్రమ ఆస్తులు భయపడ్డాయని విమర్శించారు. ఇక, త్వరలో తెలంగాణ(TELANGANA) నుండి కేసీఆర్‌ కూడా చంద్రబాబు తరిమెస్తాడని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా. ఇక, ప్రతిరోజూ కూడా గురువులను పూజించాలని సూచించారు రోజా.. భగవంతుడుతో సమానంగా మనం గౌరవించేది గురువును మాత్రమే.. ప్రతిఒక్కరు గౌరవించేది… గౌరవించాల్సింది ఉపాధ్యాయుడినే.. దేశంలో ఎక్కడ లేనివిధంగా పాఠశాలను అభివృద్ధి చేయడానికి నాడు నేడు కార్యక్రమం చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN MOHAN REDDY)కే దక్కిందన్నారు. ఒకప్పుడు నారాయణ(NARAYANA), చైతన్య(CHAITANYA) స్కూళ్లలో చదవడానికి సీటు దొరికేది కాదు.. ఇప్పుడు ఆ పరిస్థితికి ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మార్కులు సాధించారని గుర్తు చేశారు మంత్రి ఆర్కే రోజా.

ఇక మరోవైపు.. చంద్రబాబు నాయుడు స్కామ్ లకే స్కామ్ ల రాజని రాజమండ్రి ఎంపీ(RAJHAMUNDRA MP) మార్గాని భరత్ (BHARATH) అన్నారు. కేంద్ర సంస్థలు ఈడీ(ENFORCEMENT DIRECTORATE), ఐటీ(IT) సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రపంచమే నివ్వెరపోయే అవినీతి గుట్టలు అనేకం వెలుగు చూస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ సంపాదన రూ.118 కోట్ల విషయంపై ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మహా తిమింగలానికి ఈ 118 కోట్లు అల్పాహారం వంటిదని ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. నోటీసులు అందుకున్నా కనీసం చంద్రబాబు నోరు మెదపడం లేదని.. చట్టాల్లోని లొసుగులను‌ ఆధారం చేసుకుని తప్పించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. హైకోర్టులో చంద్రబాబుపై 18 స్టేలు ఉన్నాయని, వాటిని తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. చంద్రయాన్-3ని చంద్రమండలం పైకి శాస్త్ర వేత్తలు ప్రయోగించి విజయం సాధించారే కానీ.. స్కామ్ ల బాబు స్కామ్ లను పట్టుకోవడం అధికార యంత్రాంగం వల్ల కావడం లేదని భరత్ ఆరోపించారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News