తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి(Late Chief Minister Dr. Y.S. Rajasekhar Reddy) వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి కూతురు, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు తన తండ్రి స్మృతులను గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్(Andhra pradesh) లో సీఎం గా ఉన్నపుడు వైఎస్ఆర్(YSR) ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. ప్రజల కోరికలకు అనుగుణంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్అర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించిందని అన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలన్న ఉద్దేశ్యంతో ఫీజు రీఎంబెర్స్ మెంట్ పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. తాగు నీరు, సాగునీరు కోసం ఊరూరా కాలువలను తవ్వించిన ఘటన వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని కొనియాడారు.
ఈ క్రమంలో పలువురు జర్నలిస్ట్ లు కాంగ్రెస్(Congress) పార్టీలో వైసీపీ విలీనంపై పలు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆచితూచి స్పందించారు. పార్టీ విలీనంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఇది సరైన వేదిక కాదని ఇడుపులపాయలో అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకాలను షర్మిల గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అని చెప్పారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన మహానేత వైఎస్ అని కొనియాడారు. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో 700 మంది పేదల గుండెలు ఆగిపోయాయని గుర్తు చేశారు.