వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. మనదేశంలోనూ ఈ పోటీలకు పెద్ద క్రేజ్ ఉంది. తాజాగా తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఇది పెద్ద గుడ్‌న్యూసే. అది ఏంటంటే.. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం “డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్‌లో వేదికగా వెల్లడించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. అంతర్జాతీయంగా పేరుపొందిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత డబ్ల్యూడబ్ల్యూఈ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు. ఈ ఈవెంట్ టిక్కెట్లు www.bookmyshow.comలో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వైఏటీ అండ్ సి డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆదివారం ఈ ఈవెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, దేశంలోనే రెండోసారి ఈ ఈవెంట్ నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ నగరం తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. మరింత సమాచారం కోసం www.wwe.comను సంప్రదించవచ్చు.