ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ద్రవ్యోల్బణం ప్రభావంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పుతో దాదాపు ఏడాది కాలంగా ఐటీ సంస్థలు మొదలు అన్ని కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ ప్రకటించాయి. దీంతో ఉద్యోగం కోసం వెతుకుతున్న టెక్కీలు.. ఇతర నిపుణులు ఏ సంస్థ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. బారులు తీరుతున్నారు. అందుకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగర పరిధిలోని విప్రో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు తరలి వచ్చిన ఉద్యోగార్థులే ఉదాహరణ. కోల్‌కతా విప్రో క్యాంపస్ బయట వేలాది మంది ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్నారు. భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలైంది.
‘ఈ వీడియోలో కనిపిస్తున్న వారంతా కోల్ కతాలోని విప్రో క్యాంపస్ లో నిర్వహిస్తున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు వచ్చిన వారే. తక్కువ ఉద్యోగాలకే విప్రో వాక్ఇన్ ఇంటర్వ్యూలను పిలిచినా దాదాపు 10 వేల మంది ఉద్యోగార్థులు తరలి వచ్చారు. ఇప్పుడు దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు సరైన ఉదాహరణ’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్ లో వీడియో షేర్ చేశాడు. కొన్ని రోజులుగా దేశంలోని వివిధ నగరాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. దేశంలో జాబ్ మార్కెట్ ఎప్పుడూ ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. అమెరికాలో వడ్డీరేట్ల పెంపుతో ఆ దేశంతోపాటు భారత్‌లోని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఎల్లవేళలా వాక్ఇన్ ఇంటర్వ్యూలు అంత తేలిక్కాదు’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.