Why Urine Yellow: మూత్రం ఎందుకు పసుపు రంగులో ఉంటుంది.. కారణాలు ఇవే..!
Why Urine Yellow: చాలామందికి మూత్రం ఎందుకు పసుపు రంగులో ఉంటుందో తెలియదు. బహుశా వారు ఈ విషయం గురించి ఎప్పుడు ఆలోచించి కూడా ఉండరు. కానీ దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధించారు. ఎట్టకేలకు సమాధానం కనిపెట్టారు. ఇప్పుడు ఆ కొత్త అధ్యయనం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
నీరు ఒక కారణం
నిజానికి మూత్రం పసుపు రంగులోకి మారడానికి అనేక కారణాలున్నాయి. అందులో నీరు తక్కువగా తాగడం ఒక ప్రధాన కారణం. కానీ ఈ సమాధానం డాక్టర్, రోగి యాంగిల్ నుంచి సరైనది. కానీ ఇందులో వేరే విషయం దాగుంది.కిడ్నీలు రక్తం నుంచి ఫిల్టర్ చేసిన వ్యర్థాలతో పాటు చాలా నీరు మూత్రంలో ఉంటుంది. ఈ వ్యర్థాలు చనిపోయిన ఎర్ర కణాలు. ఈ కణాలు హిమోగ్లోబిన్ ద్వారా రక్తానికి ఆక్సిజన్ అందించడానికి పని చేస్తాయి. ఈ ఎర్ర కణాల జీవిత కాలం 6 నెలలు. ఎర్ర కణాలు చనిపోయినప్పుడు అవి హీమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హీమ్ మూత్రం పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుంది.
మూత్రం పసుపు రంగుకు అతిపెద్ద కారణం బిలిరుబిన్ రిడక్టేజ్ అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది జీవక్రియకు బాధ్యత వహించే ఒక ఎంజైమ్. ఇది ఎర్ర రక్త కణాల నుంచి హీమ్‌ను విచ్ఛిన్నం చేసే పసుపు వర్ణద్రవ్యం. రక్త కణాలు ఆరు నెలల జీవితాన్ని పూర్తి చేసినప్పుడు అవి ముదురు నారింజ రంగులోకి మారుతాయి. దీనిని బిలిరుబిన్ అంటారు. కొన్ని రసాయన ప్రతిచర్యలు కడుపులో జరుగుతాయి. ఇవి బిలిరుబిన్‌ను యురోబిలాన్ అణువులుగా మారుస్తాయి. ఆక్సిజన్ సమక్షంలో ఈ అణువు పసుపు రంగులోకి మారుతుంది.