స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Cheef Chandrababu Naidu) అరెస్ట్ కావడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పందించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు(Chandrababu) దోచుకున్నాడని జగన్.. వైఎస్ జగన్(YS Jagan) దోచుకున్నాడని చంద్రబాబు.. ఏంటి? మీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ నిలదీశారు. నరేంద్ర మోడీ, అమిత్‌షా, అదానీల తొత్తులా మీరు? అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతికి పాల్పడాడు గనుకే అరెస్టు అయ్యారని వ్యాఖ్యానించారు. బాబు రావాలను అంటున్నారు.. ప్రత్యేక హోదా తేలేకపోయారు.. కియా తప్పా మరే కంపెనీ తేలేకపోయారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు అంబేద్కర్, మహాత్మా గాంధీ అంటా.. లోకేష్ భగత్ సింగ్ అట అంటూ ఎద్దేవా చేశారు. దోచుకున్నవాళ్లు దేశనాయకులంట.. చాలా దారుణం అంటూ విరుచుకుపడ్డారు పాల్..
ఇక, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ బాబు.. బాయ్ బాయ్ జగన్ అంటూ హాట్ కామెంట్లు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత.. గతంలో ఫార్మా కంపెనీ(Famacy company)లకు కాలుష్యంపై ఓ హెచ్చరిక జారీచేశాను.. విజయనగరం(Vijayanagaram) ప్రజలకు సాయం అందించడంలేదని చెప్పాను.. కెమికల్స్ ద్వారా గాలి, నీరు కాలుషితంగా తయ్యారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొలిటికల్ కరెప్సన్ బాగా పెరిగిపోయింది.. పద్దెనిమిది కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.. కానీ, లాభంలో పదో అయిదు శాతం ప్రజల కోసం ఖర్చు చేయాలన్న ఆలోచన లేదన్నారు. కనీసం 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వ లేరా..? అని నిలదీశారు. నేను పోరాటం చేస్తే అన్నీ భూస్థాపితమైపోతాయి.. అందుకే ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) పెట్టాను అని చెప్పుకొచ్చారు.
42 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా, కరోనా సమయంలో నిరాహారదీక్ష చేపట్టి పదోతరగతి పరీక్షలు ఆపాను అని చెప్పుకొచ్చారు కేఏ పాల్.. ఇక, ఫ్యామిలీ రూల్ ని ఆపుదాం అందరూ ముందుకు రండి అని పిలుపునిచ్చారు. బీసీ బానిసలారా, ఎస్సీ, ఎస్టీ బానిసలారా..? ముందుకు రండి.. బడుగు బలహీన వర్గాల ప్రజలు.. ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నాయి.. మీరూ ముందుకు రండి అని పిలుపునిచ్చారు పాల్.. ఇక, స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైనా ప్రజా ప్రతినిధులు తమ పదవికి రాజీనామా చేశారా..? అనికేఏ పాల్ ప్రశ్నించారు.