విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం. సిద్ధమైంది. అయితే, దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు సాగుతున్నాయి. ఇప్పుడు సీన్‌లోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వచ్చారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మబోమని కేంద్రం అధికార ప్రకటన చేయకపోతే.. సోమవారం నుంచి ఆమరణనిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. కేంద్రం మన రాష్ట్రానికి ఏమీచేయకుండా మొండి చేయి చూపించిందని ఆరోపించిన ఆయన.. మనం కట్టిన పన్నులను గుజారత్ కు తరలిస్తున్నారు.. ఒక్క స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటే మన రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. నాకు అనుమతిస్తే 4000 కోట్ల రూపాయలు నేను సమకూర్చుతానని వెల్లడించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నరేంద్ర మోడీతో కలిసి వెళ్తానంటున్నారు.. పవన్ ఎవరు ప్యాకేజిస్తే వాళ్లతో వెళ్తున్నారంటూ అనేకమంది విమర్శలు చేస్తున్నారు. కానీ, పవన్ నాతో చేయి కలిపితే నేను గెలిపిస్తానని ప్రకటించారు పాల్.. దోపిడీదార్లను తరిమికొట్టేందుకు తెలుగు వారందరూ కలిసి రావాలని పిలుపునిచ్చిన ఆయన.. నాకు అవకాశం ఇస్తే పదిలక్షల కోట్లు అప్పులు తీరుస్తాను.. పది లక్షల ఉద్యోగాలు ఇస్తాను.. 2 లక్షల మంది స్టీల్ ప్లాంట్ ఓటర్లు ఒక్క సారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే గంగవరం పోర్టును సీజ్ చేస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు.. అదానీపరం కాకుండా ఆపి తెలుగుసత్తా చూపిస్తానన్న ఆయన.. ప్రాణం పెట్టడానికి వచ్చాను.. ప్రాణం పోయేలోపు తెలుగువారి సత్తా చూపిస్తాను అన్నారు. ఒక సంవత్సరం పాటు స్టీల్ ప్లాంట్ అమ్మమని చెప్పగలరా..? లాభాల బాటపట్టిస్తాను అంటూ సవాల్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.