నగరంలోని పలు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 19న ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోనుంది. మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు జరగనున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ బీహెచ్‌ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్ పనులు చేపట్టనున్నారు.
నీరే జీవనాధారం అంటారు. అయితే ఒక్క తాగునీరు మాత్రమే కాదు. నీరు లేనిదే జనజీవనం స్తంభించి పోతుంది. జీవితంలో నీరు లేకుండా ఒక క్షణం కూడా ఊహించుకోలేం. అలాంటిది నగరంలో రెండ్రోజులు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించగానే నగరవాసులు కంగారు పడుతున్నారు. అయితే నగరంలోని అన్నీ ప్రాంతాలకు అంతరాయం ఉండదు. దాదాపు 30 ప్రాంతాల్లో మాత్రమే పాక్షికంగా లేదంటే పూర్తిస్థాయిలో మంజీరా నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అలర్ట్ చేశారు.
హైదరాబాద్ మహా నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లయ్ ఫేజ్-2లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు పైప్ లైన్ కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో పలు ప్రాంతాల్లో మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. జలమండలి సూచించిన ప్రాంతాల ప్రజలు మంజీరా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..
ఓఅండ్ఎం డివిజన్ నెం.6 : ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట్ (తదితర ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం)
ఓఅండ్ఎం డివిజన్ నెం.8 : ఈ డివిజన్ పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు
ఓఅండ్ఎం డివిజన్ నెం.9 : కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టలో తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
ఓఅండ్ఎం డివిజన్ నెం.15 : ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్.
ఓఅండ్ఎం డివిజన్ నెం.24 : బీరంగూడ, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో వినియోగదారులు మంజీరా తాగు నీరు పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.