విస్తారా విమాన సిబ్బంది మాల్దీవులు వెళుతున్న ఓ కుటుంబానికి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. విమానంలోనే ఆ కుటుంబానికి చెందిన చిన్నారి ఆరోహి ఫస్ట్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. కేక్, ఫ్రూట్స్‌తో పాటు చిన్నారికి శుభాకాంక్షలు తెలుపుతూ చేతిరాతతో కూడిన లెటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలతో ఆశ్చర్యానికి లోనైన పాప కుటుంబ సభ్యులు ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకుంటూ బర్త్‌డే వేడుకల ఫొటోలను షేర్ చేశారు. గగనవీధిలో తమ పాప మొదటి బర్త్‌డేను విస్తారా ఉద్యోగులు సెలబ్రేట్ చేసిన తీరు తమ హృదయాలను తాకిందని థ్యాంక్యూ విస్తారా అంటూ ఆరోహి తండ్రి రోహిత్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
ఎవరి జీవితంలోనైనా తొలి బర్త్‌డే ప్రత్యేకమైనదని, 35,000 అడుగుల ఎత్తులో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మరింత ప్రత్యేకమని రోహిత్ ట్వీట్‌కు బదులిస్తూ విస్తారా రియాక్టైంది. విస్తారా పట్ల మీరు చూపిన ప్రేమాభిమానాలు తమకు సంతోషం కలిగించాయని పేర్కొంది.