విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్ర బృందం టీజర్, సాంగ్స్, ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లైగర్ వంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడం తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని విజయ్ దేవరకొండ ఫాన్స్ కోరుకుంటున్నారు.
ఈ సినిమా లో విజయ్ దేవరకొండ, సమంత ల కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రతి పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.అలాగే తాజాగా విడుదల అయిన ట్రైలర్ కూడా సినిమా పై అంచనాలు పెంచేసింది.మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ తో సినిమా పై అంచనాలు మరింత గా పెంచేస్తున్నారు… ఇదిలా ఉండగా ఖుషి సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను అందుకుంది.సెన్సార్ సభ్యులు ఈ సినిమా స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారని సమాచారం. అంతేకాదు ఈ సినిమా లో ఫ్యామిలి ఆడియన్స్ తో పాటు యూత్ ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయని సమాచారం… అలాగే ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 45 నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది.. మరి ఈ సినిమా తో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటాడో లేదో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. VD12, VD13 వర్కింగ్ టైటిల్స్‌తో అవి తెరకెక్కుతున్నాయి. VD12 మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. పరశురామ్ డైరెక్షన్‌లో VD13 రూపుదిద్దుకుంటోంది.