Monday, December 23, 2024
Home ఎడ్యుకేషన్ Education Loan Banks: విద్యా బ్యాంకు రుణాలు.. వివరాలు మీకోసం

Education Loan Banks: విద్యా బ్యాంకు రుణాలు.. వివరాలు మీకోసం

by Mahadev
0 comment 69 views
Education Loan Banks

ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. నాణ్యమైన చదువు కోసం లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. తమ లాగా బిడ్డలు కష్టపడొద్దని తల్లిదండ్రులు పిల్లల ఉన్నత చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. అయితే.. ఎంత చేసినా విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే భారీగా ఖర్చవుతుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించే విద్యా రుణాలు ఒకింత ఊరట కలిగించే విషయం. అలాగే.. సెక్షన్ 80(E) కింద విద్యా రుణాలు పొందడం ద్వారా ఆదాయ పన్ను మినహాయింపుతోపాటు పలు ప్రయోజనాలూ ఉండటంతో చాలా మంది ఎడ్యుకేషన్​ లోన్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. బ్యాంకులు అంత సులువుగా ఈ లోన్లు మంజూరు చేయడం లేదు. ష్యూరిటీ అడుగుతున్నాయి. అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎడ్యూకేషనల్​ లోన్స్ తీసుకుంటే మంచిదా? లేదా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో విద్యా రుణాలు తీసుకుంటే బెటర్​గా ఉంటుందా? అనే సందేహం వస్తోంది. మరి, ఏ బ్యాంకుల్లో విద్యా రుణం తీసుకుంటే తక్కువ వడ్డీరేటుతో లబ్ధి చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడ్యుకేషన్ లోన్ పొందడానికి అభ్యర్థి ముందుగా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన వారికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. చాలా బ్యాంకులు సాధారణంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు అందించే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో దీర్ఘకాలిక ఉద్యోగ ఆధారిత వృత్తిపరమైన, సాంకేతిక కోర్సులకు విద్యా రుణాలను మంజూరు చేస్తూ ఉంటాయి. UGC/AICTE లేదా ప్రభుత్వం గుర్తించిన చాలా దేశీయ కోర్సులకు బ్యాంకులు సాధారణంగా రుణాలను అందిస్తాయి. అలాగే.. బాగా మంచి పేరున్న యూనివర్సిటీల్లో సీటు లభిస్తే ఆ విద్యార్థులకు త్వరగానే లోన్ లభించే ఛాన్స్ ఉంటుంది.

విద్యార్థులకు ఇచ్చే ఎడ్యూకేషన్ లోన్స్ ఎంత మొత్తం వరకు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక పరిమితి ఉంటుంది. కానీ అదే ప్రైవేట్​ బ్యాంకులు లోన్ తీసుకునే విద్యార్థుల కాలేజ్​-కోర్స్​ కాంబినేషన్​ చూసుకుంటాయి. అదే విధంగా విద్యార్థికి ఆ కోర్సులు చేయడం వల్ల భవిష్యత్​లో ఎంత మేరకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయో కూడా అంచనా వేస్తాయి. వాటి ఆధారంగానే విద్యారుణాలు ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ మొత్తంలో మంజూరు చేస్తూ ఉంటాయి.లోన్ అందుకోవడానికి ఎంత సమయం పడుతుంది?ప్రైవేట్​ బ్యాంకులతో పోలిస్తే సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఈ బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం అంత సులభమైన పని కాదు. విద్యా రుణం పొందడానికి చాలా ప్రాసెస్​ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో విద్యారుణాలు చాలా త్వరగానే లభిస్తాయి. కానీ వడ్డీ రేట్లు మాత్రం కాస్త ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News