చంద్రబాబు(Chandrababu)ను బీసీలు నమ్మరు కాబట్టే పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను తెచ్చుకున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ(Expired Venugopala Krishna). అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల చట్టం ద్వారా పేదలకు భూమి పై హక్కు కల్గించింది.. బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. అచ్చెన్నాయుడికి కనీస గౌరవం లేదు.. అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.. అచ్చెన్నాయుడు పనికి రాడనే పవన్ కల్యాణ్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయంటూ జోస్యం చెప్పారు. బీసీల మీద ప్రేమ ఉందని చెప్పే టీడీపీ.. బీసీలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు సభలో లేరని విమర్శంచారు.. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు టీడీపీ పార్టీలో బీసీలు ఉన్నారు.. చంద్రబాబు బీసీల కోసం ఒక పథకం పెడితే దాన్ని అమలు చేయించుకోవడానికి గతంలో అడుక్కోవాల్సిన పరిస్థితి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలను మోసం చేశారు.. జగన్ మోహన్ రెడ్డి బీసీలు సమాజానికి వెన్నుముక అని భావించారని తెలిపారు.
ఇక, నిర్మాణాత్మకమైన సూచనలు చేయాల్సిన ప్రతిపక్షం సభకు రాకపోవడం దురదృష్టకరం అన్నారు మంత్రి వేణు.. ప్రతిపక్షానికి బాధ్యత లేదు.. ప్రజలకు అవసరమైన అంశాల పై బాధ్యతగా మెలగాల్సిన ప్రతిపక్షం సభ నుంచి పారిపోయిందన్నారు. తప్పు చేసిన చంద్రబాబు జైలుకెళ్లాడు.. చంద్రబాబు అరెస్ట్ తో అశాంతిని సృష్టించి లాభం పొందాలని చూసి ప్రతిపక్షం భంగపడిందన్నారు. ప్రజల తరపున పని చేస్తున్న ప్రభుత్వాలకు న్యాయస్థానాలు అండగా నిలుస్తాయి.. తప్పు చేసిన చంద్రబాబును న్యాయస్థానం జైలుకి పంపిందన్నారు. శాసన సభలో కీలక అంశాల పై చర్చ జరుగుతున్న సమయంలో సభ నుంచి టీడీపీ నేతలు వెళ్లిపోయారు.. ప్రశ్న వేసిన టీడీపీ నేతలు మేం జవాబు చెప్పే సమయంలో సభలో లేకుండా పోయారని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.