వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఆయనో ప్రముఖ ఆస్ట్రాలజర్. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్యకాలంలో ఆయన చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన చెబుతున్న జాతకాలు ఎంతవరకు నిజమో కానీ చేసిన వ్యాఖ్యలు మాత్రం అంతకంతకూ వైరల్ అవుతున్నాయి. గతంలో కొందరు సినీ సెలెబ్రెటీల గురించి వేణు స్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజం కావడంతో ప్రస్తుత కాలంలో ఆయనను నమ్మే వారి సంఖ్య ఎక్కువైంది.
సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీతిసింగ్, రష్మిక వంటి సెలబ్రిటీల జాతకాల గురించి వేణుస్వామి చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. అయితే తాజాగా మరో జంట గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత నాగచైతన్య లాగే టాలీవుడ్లోని మరో జంట త్వరలోనే విడాకులు తీసుకుంటారని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మామూలుగా అయితే ఆయన చెప్పేది సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. అప్పుడప్పుడు తను చెప్పినవి నిజం కావడంతో వారు ఆయనపై నమ్మకం కనబరుస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు రష్మిక, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇటీవల ఆయనతో పరిహార పూజలు చేయించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మధ్య నిహారిక రెండో పెళ్లి గురించి కూడా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.
ఇక ఇప్పుడు మరో స్టార్ జంట సమంత, చైతన్యలాగే విడిపోబోతుందని బాంబు పేల్చాడు. ఆది పిని శెట్టి , నిక్కి గల్రానీ కూడా విడిపోతారంటూ చెప్పుకొచ్చాడు. వీరి జాతకం క్షుణ్నంగా పరిశీలిస్తే.. వీరిద్దరు కలిసి ఉండటం అసాధారణమని.. 80 శాతం విడాకులకు అవకాశం ఉందన్నాడు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడు వేణు స్వామి కామెంట్లతో వారి జీవితం ఎలా మారుతుందో చూడాలి.