‘బావల్’ సినిమా తర్వాత, వరుణ్ ధావన్ ఇప్పుడు ‘VD 18’ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆయన నిన్న ముంబైలో డైరెక్టర్ అట్లీతో కలిసి కనిపించాడు. అట్లీ నిర్మాతగా వరుణ్ హీరోగా ‘VD 18’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అట్లీ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘వీడీ 18’ రూపొందుతోండగా కలిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీడీ 18’ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందన్న సమాచారం మొన్ననే తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఒక్కరోజులోనే వరుణ్ ధావన్ గాయపడ్డాడన్న వార్త అభిమానుల్లో ఆందోళనను మరింత పెంచింది. వరుణ్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పిక్ షేర్ చేసుకుని తన గాయం గురించి తెలియజేశాడు. ఇక ఆ ఫోటో నటుడి శరీరానికి చెందిన పైభాగాన్ని చూపిస్తోంది, అందులో ఎడమ మోచేయిపై ఎర్రటి గాయాన్ని చూపిస్తున్నారు.
ఇక ఈ ఫొటో షేర్ చేస్తూ వరుణ్ ధావన్ క్యాప్షన్‌లో ఇలా రాశాడు, ‘నొప్పి లేదంటే లాభం కూడా ప్రయోజనం లేదని రాసుకొచ్చారు. ఈ పిక్ చూస్తుంటే ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్ గాయపడి ఉండవచ్చని తెలుస్తోంది. దర్శకుడు అట్లీ – నిర్మాత మురాద్ ఖేతాని సంయుక్త నిర్మాణంలో ‘VD18’ అనే యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌కి తమిళ డైరెక్టర్ కలీస్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్‌తో పాటు ‘బావల్’ లో నటించిన కొందరు నటులు, కీర్తి సురేష్ సహా వామిక గబ్బి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. ఈ సినిమా కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ అని చెప్పచ్చు. ‘VD 18’ని మే 31, 2024న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ‘వీడీ 18’ని హిందీలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసి ఒక ప్రోమోలా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.