జాబిల్లి(MOON) దక్షిణ ధ్రువంపైకి పరిశోధనలకు పంపిన ‘చంద్రయాన్-3′(CHANDRAYAN -3) విజయంతో ఊపుమీదున్న భారత్(BHARATH).. త్వరలో ‘సముద్రయాన్’కు(SAMUDRAYAN) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య-6000(SAMUDRAYAN MATSYA 6000).. తుది మెరుగులు దిద్దుకుంటోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి(UNION MINISTER) కిరణ్ రిజిజు(KIRAN RIJIJU).. సామాజిక మాధ్యమాల్లో(SOCIAL MEDIA) షేర్ చేశారు. “తదుపరి ప్రయాణం.. ‘సముద్రయాన్’. ఇది చెన్నైలోని(CHENNAI) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(NATIONAL INSTITUTE OF OCEAN TECHNOLOGY)లో నిర్మితమవుతున్న మత్స్య-6000 జలాంతర్గామి. భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్‌లో భాగంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చుని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు. దాంతో సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ వ్యవస్థ సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగించదు” అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. జలాంతర్గామిలో కూర్చుని పరిశీలించిన కిరణ్ రిజిజుకు దాని విశేషాల గురించి నిపుణులు వివరించారు.
‘సముద్రయాన్’ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుంది. ఆక్వానాట్‌లను ఆరు వేల మీటర్ల లోతు వరకు తీసుకెళ్లేందుకు గోళాకార నౌకను నిర్మించనున్నారు. తొలుత ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు సమాచారం. బ్లూ ఎకానమీని ప్రోత్సహించడంలో భాగంగా భారత్ ఈ డీప్ ఓషన్ మిషన్‌ను చేపట్టింది. సముద్ర గర్భంలో అపారమైన ఖనిజ నిల్వలున్నాయి. అలాగే అరుదైన జీవజాలం అక్కడ నివసిస్తోంది. వాటిని సమర్థవంతంగా వినియోగిస్తే ఆర్థికవృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2026 నాటికి ఈ మిషన్ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని గతంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.