Monday, December 23, 2024
Home జాతీయం Nanded Government Hospital: ఆగని మృత్యు ఘోష.. 48 గంటల్లో 31 మంది మృతి

Nanded Government Hospital: ఆగని మృత్యు ఘోష.. 48 గంటల్లో 31 మంది మృతి

by Mahadev
0 comment 45 views
Nanded Government Hospital

మహారాష్ట్రలోని నాందేడ్‌(Nanded) ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో మరణ మృదంగం(Patients Die) కొనసాగుతోంది. తాజాగా మరో 7 మరణాలు నమోదయ్యాయి. అందులో నలుగురు చిన్నారులే ఉండటం గమనార్హం. తాజా మరణాలతో కలిపి 48 గంటల వ్యవధిలో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరింది. ఇందులో 16 మంది చిన్నారులే ఉండటం గమనించదగ్గ విషయం. నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. నిన్న 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా.. అందులో 12 మంది నవజాత శిశువులు ఉండటం అందర్నీ కలిచివేసింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే(CM Eknath Shinde)ను విలేకరులు ప్రశ్నించగా, ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఘటనపై తనకు సమాచారం లేదని సీఎం వ్యాఖ్యానించారు. అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటానని ఆయన చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఈ మరణాలకు బాధ్యత వహించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు. కాగా, కొద్దిరోజుల క్రితం థాణే ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అక్కడ 36 గంటల్లో 22 మంది రోగులు మరణించారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News