యానాంలో ప్రియురాలి ఆత్మహత్య తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు చనిపోయాడనే మనస్తాపంతో ప్రియరాలు ఆత్మహత్య చేసుకుంది. యూవీకే నగరి కి చెందిన మౌనిక (22) రెండేళ్లుగా నిమ్మకాయల చిన్నా అనే యువకుడితో ప్రేమలో ఉంది. గంజాయికి బానిసైన అతడు తన సోదరుడు రూ.500 ఇవ్వలేదని ఇటీవల ఆత్మహత్య పాల్పడ్డాడు. అప్పటి నుంచి చిన్నా ఫొటోలను గోడకు అతికించి చూసుకుంటూ మౌనిక మానసికంగా కుంగుతూ నిన్న ఉరేసుకుని చనిపోయింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక (22) తన మేనమామ త్రిమూర్తులు ఇంట్లో ఉంటుంది. మౌనికకు అక్క, ఓ చెల్లి ఉన్నారు. వీరి తల్లిదంద్రులు పదేళ్ల క్రితం మరణించారు. అయితే మౌనిక తన అక్క, చెల్లికి పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుం ఆమె తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మౌనిక బాగోగులు అంతా మేనమామ త్రిమూర్తులు చూస్తున్నారు. మౌనిక కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాను ప్రేమిస్తోంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. అయితే చిన్నా గంజాయికి బానిసగామారాడు. అతడిని మార్చుకునే పనిలో పడింది. ఇదిలా ఉంటే గంజాయికి బానిసగా మారిన చిన్నా రెండు నెలల క్రితం తన సోదరుడిని రూ.500 అడిగాడు. సోదరుడు ఇచ్చేందుకు నిరాకరించాడు.
దీంతో చిన్నా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.కుటుంబ సభ్యులు కాకినాడలోని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ప్రియుడి మరణాన్ని మౌనిక భరించలేకపోయింది. కాలేజీకి వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ మానసికంగా కృంగిపోయింది. ఇక ప్రియుడు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయిన మౌనిక సోమవారం రాత్రి తన ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.