రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. కొందరు లైంగిక వాంఛలు తీర్చుకుంటే.. మరికొందరు తమలోని రాక్షసత్వాన్ని పూర్తిగా బయటకు తీస్తూ.. మానవత్వానికి గడ్డు పరిస్థితి వచ్చిందనే భయాన్ని నెలకొల్పుతున్నారు. అలాంటి ఘటనే జరిగింది వరంగల్ పాలకుర్తిలో జరిగింది. ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు 12 ఏళ్ల బాలికలను అతి క్రూరంగా చెట్టుకు కట్టేసి కట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు బాలికలను చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో దొంగతనం నెపంతో ఇద్దరు 12 ఏళ్ల బాలికలను గ్రామంలోని బొడ్రాయి వద్ద చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మానవత్వానికి మచ్చ తెచ్చేలా కళ్లల్లో కారం కొట్టి మామిడి కాయ పచ్చడ కళ్లల్లో రుద్ది నానా హింస పెట్టారు. ఇద్దరు ఇతర కులానికి చెందిన వారు బాలికల తల్లిదండ్రులను సైతం ఇబ్బందులకు గురి చేశారు.
చెన్నూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిలో 15 రోజుల క్రితం రూ.1.35 లక్షలు నగదును ఎవరో ఎత్తుకెళ్లారు. అయితే వారింటికి ఆయన సోదరుడి కూతురుతో పాటు మరో ఇద్దరు అమ్మాయి తరుచుగా వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆ డబ్బులను వీరే తీశారని అనుమానంతో ఇంటి యజమాని దారుణంగా కొట్టాడు.ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించడంతో వారు మౌనంగా ఉండిపోయారు. ఆ విషయం ఆ నోటా ఈనోటా మంగళవారం బయటపడింది. కాగా, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సమాచారం అందిందని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.