ఎందరో వైద్యులు(Doctors) తమ వైద్య వృత్తిలో గల అపూర్వమైన జ్ఞానంతో తమ అనేక మంది జీవితాలు బాగు చేస్తుంటే.. మరికొంతమంది వైద్యుల నిర్వాకం వల్ల ఆసుపత్రికి వచ్చిన రోగులు ప్రాణాలు(Patients Life) పోగుట్టుకుంటున్నారు. తెలిసి తెలియని తనమో.. లేదా నిర్లక్షమో.. లేదా అసలు ఆలా చేయడం తప్పు అని తెలియక పోవడమో మొత్తానికి తమ సుఖం కోసం ఆసుపత్రికి వచ్చిన వారి ప్రాణాలు బలిగొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అందరి హృదయాల్ని తీవ్రంగా కలిచివేస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని(Uttar Pradesh) శామలి జిల్లా(Shamali district)లో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల(newborn babies) ప్రాణాలు బలితీసుకుంది. హాయిగా నిద్రపోవడానికి డాక్టర్ ఏసీ వేసుకోగా.. ఆ చలికి (Cool)తట్టుకోలేక ఇద్దరు శిశువులు మరణించారు. దీనికి కారణమైన డాక్టర్ నీతును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించారు.
వీరిద్దరిని ఫొటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు వెళ్లేసరికి.. విగతజీవులయ్యారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ దారుణానికి కారణమైన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.