తెలంగాణలో బోర్డ్ ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థులు.. మంచి మార్కులు సంపాదించుకోవడంలో ఇది సహాయపడుతుందని చెప్పింది. జాతీయ విద్యా విధానం ప్రకారం కొత్త పాఠ్య ప్రణాళిక సిద్ధంగా ఉందని.. దాని ప్రకారమే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు రూపొందించాలని చెప్పింది. కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం.. 11, 12వ తరగతి విద్యార్థులు.. రెండు లాంగ్వేజెస్‌ను నేర్చుకోవాలి. అందులో ఒకటి భారతీయ భాష అయ్యి ఉండాలి. 11, 12వ తరగతి విద్యార్థులు.. సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం పొందుతారు. కేవలం ఎంచుకున్న స్ట్రీమ్‌లోని సెబ్జెక్ట్లే పరిమితం కాకుండా.. మిగతా సెబ్జెక్టులు కూడా నేర్చుకోవచ్చు.
’11, 12 తరగతి విద్యార్థులు రెండు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి భారతీయ భాషై ఉండాలి. ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగినంత సమయం దొరుకుతుంది. అలాగే వారు మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడుతుంది. బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు నెలల తరబడి పాఠ్యాంశాలను కంఠస్థం చేయకుండా.. వారి సామర్థ్యాలను పెంచుకునేందుకు సాయపడుతుంది. అలాగే 11,12 తరగతుల విద్యార్థులు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి స్ట్రీమ్‌లోని సబ్జెక్ట్లే కాకుండా ఏ సబ్జెక్ట్‌నైనా ఎంపిక చేసుకోవచ్చు.’ అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది పది, 12 తరగతి బోర్డు పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆయా తరగతుల్లో టాప్-10 విద్యార్థులకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పించారు. రాష్ట్రస్థాయి/ జిల్లా స్థాయిల్లో టాపర్లుగా నిలిచినవారికి హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. పిల్లలను మరింతలా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని భూపేశ్ బఘేల్ తెలిపారు.