టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గుర్ని స్పెషల్ ఇంట్రాగేషన్ టీం (సిట్) అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ బంధువులైన ముగ్గుర్ని తాజాగా అరెస్ట్ చేసింది. ఇవాళ్టి అరెస్టులతో కలిసి పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం అరెస్టు అయిన వారి సంఖ్య 99కి పెరిగింది. అరెస్టయిన ముగ్గురు నిందితులు ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రవీణ్‌కు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. మరో వైపు ఈ కేసులో ఏ2 రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ మూడుసార్లు తిరస్కరణకు గురైంది.
అంతకముందు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో అయిదుగురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో అయిదుగురిని సిట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో ములుగు అటవీ విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న కామారెడ్డికి చెందిన మణికంఠ, ఖమ్మం జిల్లాకు చెందిన మొక్కల ప్రవీణ్‌కుమార్, హనుమకొండకు చెందిన తాళ్లపల్లి సాయిదీప్, గణేశ్ ఉన్నారు.
దీనికి ముందు ఏఈ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఎలక్ట్రికల్ డిఇ ఇప్పటికే హైటెక్ కాపీయింగ్ పాల్పడినట్టు గుర్తించగా తాజాగా ప్రజా ప్రతినిధులు కూడా అతని నుంచి సాయం పొందినట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో పెద్ద సంఖ్యలో అరెస్టులు ఉంటాయని సిట్ దర్యాప్తు బృందం చెబుతోంది. ఇప్పటికే అరెస్టైన వారిని డిబార్ చేస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిబార్ చేసిన వారికి వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వగా వారి నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రానందున ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.