తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TELANGANA TEACHER ELIGIBILITY TEST) 2023 హాల్ టికెట్లు(HALL TICKETS) టెట్ కన్వీనర్, రాష్ట్ర విద్యా పరిశోధన & శిక్షణ మండలి సంచాలకురాలు రాధారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు దరఖాస్తు ఐడీ(ID), పుట్టినతేదీ(DATE IOF BIRTH) వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్(WEBSITE) నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్(DOWNLOAD) చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో(EXAMINATION CENTERS) సెప్టెంబర్ 15వ(SEPTEMBER 15) తేదీన టెట్ పరీక్ష(TET EXAM) నిర్వహించనున్నారు. టెట్ పేపర్ 1 పరీక్షకు 1139 పరీక్ష కేంద్రాలు, పేపర్ 2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కన్వినర్ తన ప్రకటనలో పేర్కొంది.
కాగా టెట్ పరీక్షకు పేపర్ 1కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండు పేపర్లకు కలిపి 1,86,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది టెట్ 2023 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,91,058 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష రాయడానికి హాల్‌టికెట్లను తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ల వివరాల్లో తప్పులుంటే సంబంధిత పరీక్షా కేంద్రంలో సరిచేసుకోవచ్చన్నారు. అక్కడ నామినల్ రోల్స్ కమ్ ఫొటో ఐడెంటిటీ(PHOTO IDENTITY)లో వాటిని సరిచేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అభ్యర్థులు సెప్టెంబరు 14వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్య ఎదురైతే హెల్ప్ డెస్క్(HELP DESK) 040-23120340, 040-23120433 ఫోన్ నంబర్ల ఫోన్ చేయవచ్చని సూచించారు.
టెట్ నిర్వహణకు సంబంధించి ఎస్‌సీఈఆర్‌టీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 15వ తేదీన రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. టెట్ పరీక్ష అనంతరం ఫలితాలు కూడా ఇదే నెలలో అంటే సెప్టెంబరు 27న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కొలువు సొంతం చేసుకోవాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అలాగే టెట్‌లో అర్హత సాధించిన వారే డీఎస్సీ రాయడానికి అర్హులు కూడా. డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ వెయిటేజీ మార్కులు కీలకంగా ఉంటాయి.