టీనేజ్ వయస్సు.. ఉరకలు వేసే వయస్సు. ఏదైనా సాధించగలం.. మనకు కావలసింది పొందడానికి ఎంతకైనా తెగించే వయస్సు. ఈ వయస్సుకి చక్కటి సంస్కారంతో పాటు విద్య తోడైతే తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవారు అవుతారు. ఈ సమయంలోనే చెడు మార్గంలో ప్రయాణిస్తే.. తమ జీవితాన్ని సర్వస్వాన్ని కోల్పోతారు. ఇటీవల కాలంలో టీనేజర్లు చాలా చెడిపోతున్నారు. అరచేతిలో మొబైల్ లో తమకు కావాల్సినవి అన్నీ చూసేశాక.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా చెడు సహవాసాలు, ప్రేమ అన్న పేరుతో వ్యామోహాల బారిన పడుతున్నారు. చివరగా తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకు అనేక ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. చదువుకోవాల్సిన వయస్సులో ప్రేమ అంటూ అబ్బాయిలతో తిరిగి తమకే కాదు కన్న తల్లిదండ్రులకు కూడా మాయని మచ్చను తెచ్చిపెడుతున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
విశాఖపట్నంలో బేబీ సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని (17) ఒకే సమయంలో సాయికుమార్ (23), సూర్య ప్రకాష్ (25) అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. ఆ బాలిక సాయికుమార్‌తో రహస్యంగా తాళి కట్టించుకున్నాక కూడా సూర్యప్రకాష్‌తో ప్రేమాయణం నడిపింది. తరువాత పెళ్లి చేసుకున్న వీడియో, సూర్యప్రకాష్‌తో ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. దీంతో ప్రియుడు, భర్త ఇదేంటని బాలికను నిలదీశారు. మనస్థాపానికి గురైన బాలిక “సూర్య.. వాళ్లు ఎవరినీ వదలకు, కుక్క చావు చావాలి కొడుకులు” అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా సూర్యప్రకాష్ బయపడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భర్త సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.