కొత్తగా గ్రాడ్యుయేషన్ చేసిన వారికి సాఫ్ట్ వేర్ జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎటువంటి కోర్సులు నేర్చుకొంటే మంచి జాబ్ వస్తుందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడైన భవిష్యత్‌ను ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కోర్సులు నేర్చుకోవాలి. దీని ద్వారా తక్షణ లాభంతో పాటు భవిష్యత్‌లో కెరీర్ చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు వివరాలను తెలుసుకోండి..
ప్రస్తుత ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్స్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటిగా నిలుస్తోంది. కంపెనీలకు నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో పాటు అవి మరింత సమర్థవంతంగా మారడానికి క్లౌడ్ టెక్నాలజీ అవసరం. క్లౌడ్ కంప్యూటింగ్ అన్ని రంగాల్లోనూ ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా సమాచార వ్యవస్థను సమర్థవంతంగా మెయింటెన్ చేస్తుంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇంతటి ప్రయోజనం ఉండడంతో కంపెనీలు ఈ సాంకేతికతను అమలు చేయడం ప్రారంభించాయి. ఫలితంగా క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణుల కోసం డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీలో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మీరు ఈ రంగంలో ప్రొఫెషనల్‌గా మారవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రముఖ సంస్థలు పీజీ కోర్సును అందిస్తున్నాయి. తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యతను నిరుద్యోగులకు తెలియజేసేందుకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ కోర్సులో అవ్వాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు ఎలాంటి టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్/స్కిల్స్ అవసరం లేదు.