పాకిస్తాన్ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ లోని ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. ఆయనపై ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేసింది. దీతో ఆయన ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అవినీతి కేసులో ఈ మేరకు కోర్టు శిక్షను విధించింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన విలువైన బహుమతులను అమ్ముకున్నారనే కేసులో ఆయనకు కోర్టు శిక్షను విధించింది. ఇమ్రాన్ ఖాన్ పై మే 10న పాకిస్థాన్ ఎలెక్షన్ కమిషన్ క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేసింది.
పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న కాలంలో ఖజానాకు వచ్చే విలువైన బహుమతుల్ని తీసుకున్న వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలారు. దీంతో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే ఐదేళ్ల పాటు అనర్హత వేటు కూడా పడింది. అంటే ఈ ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కు ఇది భారీ షాక్ గా మారబోతోంది.
తోషాఖానా (ప్రభుత్వ ఖజానా)కు వచ్చిన బహుమతుల స్వీకరణ కేసులో ఇస్లామాబాద్ లోని ట్రయల్ కోర్టు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనకు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ మేరకు ఇమ్రాన్ అరెస్టుకు వారెంట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పోలీసులు ఇమ్రాన్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇమ్రాన్ పార్టీ పీటీఐ..ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగమని పేర్కొంది.