జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్‌కుమార్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. పోలీసులు నిందితుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ అని పోలీసులు గుర్తించారు. ఉదయం 5 గంటల సమయంలో బి5 కోచ్‌లో తన ఆటోమేటిక్ వెపన్ గన్ ద్వారా చేతన్ సింగ్ కాల్పులు జరిపాడని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేర్కొంది. ముంబైకి 100 కిమీ దూరంలో ఉన్న పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత నిందుతుడు కాల్పులు జరిపాడు. నలుగురిని కాల్చి చంపిన తర్వాత అతడు దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.
‘జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (12956)లో జరిగిన కాల్పుల ఘటనలో ఆర్పీఎఫ్ ఏఎస్సైతో సహా నలుగురు మరణించారు. నిందితుడిని అరెస్టు చేశారు. డీసీపీ ఉత్తర జీఆర్‌పీకి సమాచారం అందించబడింది’అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపింది. ఆర్పీఎఫ్ ఏఎస్సై టికా రామ్ అని తెలుస్తోంది. ముగ్గురి ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చేతన్ సింగ్ ఎందుకు ఈ కాల్పులు జరిపాడో అని పోలీసులు విచారిస్తున్నారు.