భారతదేశంలోని అత్యంత పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది కేరళలోని పెరియార్. విభిన్నమైన వృక్షజాలం, జంతుజాలంతో ఇక్కడి నేల సాధర ఆహ్వానం పలుకుతుంది.
ఈ ప్రదేశం
అభయారణ్యం నడిబొడ్డున ఉన్న సుందరమైన సరస్సు పెరియార్ నేషనల్ పార్క్ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆ సరస్సుపై పడవ విహారంలో అడవిని అన్వేషిస్తూ, కొన్ని అరుదైన జంతువులను వీక్షించవచ్చు. మార్చి నుంచి మే నెలలో ఈ సరసు దగ్గర ఎక్కువ ఏనుగులను, పులులను చూడవచ్చు.
భారతదేశంలోని అనేక ఇతర జాతీయ ఉద్యానవనాల మాదిరిగా కాకుండా, పెరియార్ నేషనల్ పార్క్ ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది.
వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండే సెప్టెంబర్ నుంచి మే మధ్య కాలంలో పెరియార్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించడం ఉత్తమం. మీరు మార్చి నుంచి మే మధ్య పెరియార్ టూర్ ప్లాన్ చేసుకుంటే, ఏనుగులను గుర్తించగలరు. వర్షాకాలంలో తెరిచే కొన్ని భారతీయ జాతీయ ఉద్యానవనాలలో పెరియార్ ఒకటి. ఈ సమయంలో ట్రెక్కింగ్, బోట్ సఫారీలు రెండూ అందుబాటులో ఉన్నాయి.
ఈ పెరియార్ గ్రామంలో మసాలా మొక్కల మధ్య చిన్న, మనోహరమైన కుటీరాలు ఉన్నాయి. చిన్న ఇళ్లు పెరియార్‌కు మరెక్కడా కనిపించని మనోజ్ఞతను, అలాగే హాయిని కలిగిస్తాయి. గ్రామం యొక్క చల్లని వాతావరణం కృత్రిమ శీతలీకరణ యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. పక్షుల కిలకిలారావాలు మాత్రమే ఈ ప్రాంతంలో ధ్వనిస్తాయి.
ఇక్కడ పెరియార్ లేక్, మంగళ దేవి టెంపుల్, పులుమేడు, మాతా అమృతానందమయి దేవి ఆలయం, వంది పెరియార్, కడతానాదన్ కళారీ, నవరస కథాకళి సెంటర్ వంటి పర్యటక ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఇక్కడ ఏనుగు సఫారీ, జీప్ సఫారీ, బోట్ క్రూయిజ్ ను ఆనందించవచ్చు. అదృష్టవశాత్తూ సఫారీకి వెళ్లేటప్పుడు, స్లాత్ బేర్, సింహం తోక గల మకాక్, క్రిమ్సన్ బ్యాక్డ్ సన్‌బర్డ్, నీలగిరి ఫ్లైక్యాచర్, సలీం అలీ యొక్క ఫ్రూట్ బ్యాట్, కింగ్ కోబ్రా, వైపర్, ఫ్రాగ్స్ టోడ్స్ వంటివి అరుదైన జంతువులను చూడవచ్చు.
ఇక్కడ సేద తీరడానికి రిసార్ట్లు, హోటళ్లు చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి ఒడిలో చుట్టూ పచ్చని వృక్షాల మధ్య ఉండే రూమ్స్ లో సేద తీరవచ్చు.
ఇది పర్యాటకులకు మనోహరమైన దృశ్యాన్ని పరిచయం చేస్తుంది. ఈ ప్రాంతం యొక్క సుందరమైన అందం, సుసంపన్నమైన జీవవైవిధ్యాన్ని చూసేందుకు కుటుంబసమేతంగా పెరియార్ పర్యటనను ప్లాన్ చేయొచ్చు.