అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 88 పాయింట్లు లాభపడి 65,305 వద్ద.. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 19,427 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.07 వద్ద ఉంది. నిఫ్టీ గెయినర్స్ సూచీలో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ ఉన్నాయి. టాప్ లూజర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్ ఉన్నాయి. నేడు ట్రేడింగ్‌లో గ్రూప్ కంపెనీల అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్ షేర్లు 7 శాతానికి పైగా లాభాలను గడించాయి. ప్రమోటర్లు , విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బహిరంగ మార్కెట్ ద్వారా ఈ కంపెనీలలో వాటాలను కొనుగోలు చేయడంతో.. గత మూడు రోజుల్లోనే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్ షేర్లు 12 శాతం మేర ర్యాలీ చేశాయి.
అయితే, గత రోజుల మూడు రోజుల నుంచి ట్రేడింగ్ సెషన్లలో అదానీ పవర్ షేర్ 16 శాతం పెరిగింది. వాస్తవానికి, ఆస్ట్రేలియా-లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్ బ్లాక్ డీల్స్ ద్వారా 8.1 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ పవర్‌లో రూ. 9,000 కోట్లు పెట్టుబడులను పెట్టింది. అదనంగా, అదానీ పవర్ బిట్టా, ముంద్రా, కవై, తిరోడా, ఉడిపి, రాయ్‌పూర్, రాయ్‌గడ్‌లోని అనేక ప్రదేశాలలో 12,450 మెగావాట్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 40 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.