Monday, December 23, 2024
Home భక్తి Zodiac Signs: నేటి 12రాశుల జాతక ఫలాలు..

Zodiac Signs: నేటి 12రాశుల జాతక ఫలాలు..

by స్వేచ్ఛ
0 comment 101 views
zodiac signs

ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారు ఏ దేవుడిని పూజించాలి.. 12రాశుల శుభ అశుభ ఫలితాల వివరములు..

మేషం
మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితాదేవిని ప్రార్థించాలి.

వృషభం
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మిథునం
అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

కర్కాటకం
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

సింహం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్యహృదయం చదవడం ఉత్తమం.

కన్య
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తిశ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

తుల
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. సద్గోష్ఠి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగడానికి విష్ణుధ్యానం శుభప్రదం.

వృశ్చికం
మనఃస్సౌఖ్యం కలదు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

ధనస్సు
ప్రారంభించబోయే పనుల్లో దేహజాఢ్యాన్ని రానీయకండి. ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

మకరం
మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదు. గోసేవ చేయాలి.

కుంభం
మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం చదవాలి.

మీనం
ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవనామాన్ని జపించడం ఉత్తమం.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News