దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 54,500గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,45,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,450గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 59,450గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,94,500గా ఉంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,600గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 59,450గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,750గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,730గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,450గాను ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,450గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 59,500గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,450గా ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు శనివారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 76,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 76,900గా ఉండేది. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 79,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,400.. బెంగళూరులో రూ. 75,000గా ఉంది.
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 170 పెరిగి.. రూ 24,890కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,720గా ఉండేది. ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,890గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.