Monday, December 23, 2024
Home తెలంగాణ Gruha Lakshmi: ‘గృహలక్ష్మి’కి నేడే చివరి తేదీ.. ఇక్కట్లు పడుతున్న ప్రజలు

Gruha Lakshmi: ‘గృహలక్ష్మి’కి నేడే చివరి తేదీ.. ఇక్కట్లు పడుతున్న ప్రజలు

by స్వేచ్ఛ
0 comment 144 views
GRUHALAKSHMI

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మొదటి విడతకు నేటితో గడువు ముగుస్తుండటంతో ఇళ్లు లేని పేదలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ పథకంపై మంత్రి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్ గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని.. దీనికి తుది గడువు అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. మొదటి విడతకు మాత్రమే ఇవాళ ఆఖరి తేదీ అని.. అనంతరం మళ్లీ విడతల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని వారు తెలిపారు.

ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేరేందుకు.. గృహలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణకు ఇవాళ చివరి రోజు కావడంతో మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని.. గడువు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం జనాలతో కిక్కిరిసిపోయింది. నారాయణపేట జిల్లాలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. దాంతో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దార్‌ కార్యాలయానికి గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు. అవసరమైన పత్రాలు అందకపోతే లబ్ధి పొందలేమని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. గడువు పెంచే విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. మరోవైపు కరీంనగర్ నగరపాలక సంస్థలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

నిబంధనల ప్రకారం గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 20వ తేదీలోగా దరఖాస్తుదారుల వెరిఫికేషన్ పూర్తి చేసి 25న తొలి దశ లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న ఆయన.. పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News