ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇటీవల తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగాయి. అయితే మళ్ళీ శ్రావణమాసంలో పెళ్లిళ్లు సీజన్ మొదలు కాగా.. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు పెరిగాయి.
బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,070గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,220గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,500 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా కొనసాగుతోంది. బంగారం ధరలు పెరిగితే ..వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 73,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,300గా ఉండగా.. చెన్నైలో రూ. 76,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,500ల వద్ద కొనసాగుతోంది.