ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? అనే వివరాలను తెలుసుకోండి..
మేషం
ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అపరిచితులతో జాగ్రత్త. శ్రీలక్ష్మీ స్తోత్రం చదివితే మంచిది.
వృషభం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తి కాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. అష్టమంలో చంద్రుడు అనుకూలంగా లేడు. చంద్ర శ్లోకం చదవండి.
మిథునం
ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాస్తుతి చేస్తే మేలు.
కర్కాటకం
ఒక వ్యవహారంలో తోటివారి సహకారం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. మనఃశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. దుర్గా శ్లోకం చదవండి.
సింహం
శుభ ఫలితాలు ఉన్నాయి. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన శక్తిని ఇస్తుంది.
కన్య
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. పైఅధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సూర్యనమస్కారం మీ ఆత్మశక్తిని పెంచుతుంది.
తుల
ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మాట విలువను కాపాడుకోవాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృశ్చికం
బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శరీర సౌఖ్యం కలదు. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
ధనస్సు
గొప్ప కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని ఆర్థిక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామ సందర్శనం ఉత్తమం.
మకరం
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇబ్బంది పెట్టే వారి గురించి పట్టించుకోకండి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేసుకోకండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నవగ్రహ ధ్యానం చేసుకుంటే మంచిది.
కుంభం
స్థిర నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దుర్గాస్తుతి వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచేలా ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సూర్యభగవానుని సందర్శనం ఉత్తమం.