Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ Tiruamala Salakotla Brahmotsavams: సెప్టెంబర్ 18నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

Tiruamala Salakotla Brahmotsavams: సెప్టెంబర్ 18నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

by స్వేచ్ఛ
0 comment 60 views
tirumala bramotshavam

సెప్టెంబరు(September) 18వ తేదీ నుంచి తిరుమల(Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 17వ తారీఖు ఆదివారం నాడు అంకురార్పణ- రాత్రి 7 నుంచి 8 గంటల వ‌ర‌కు జరుగనున్నాయి. ఇక, 18 నాడు సోమ‌వారం రోజు బంగారు తిరుచ్చి ఉత్సవం-మ‌ధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్నాయి. ధ్వజారోహ‌ణం(మీన ల‌గ్నం) – సాయంత్రం 6.15 నుంచి 6.30 గంట‌ల వ‌ర‌కు జరుగుతాయి. పెద్దశేష వాహ‌నం – రాత్రి 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు కొనసాగుతుంది.

19వ తారీఖున మంగ‌ళ‌వారం(Tuesday) నాడు చిన్నశేష వాహ‌నం – ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. అలాగే స్నప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు.. హంస వాహ‌నం – రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు జరుగనున్నాయి. ఇక, 20వ తారీఖు బుధ‌వారం(Wednesday) రోజు సింహ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్నప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు.. ముత్యపుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్నాయి.

21తేది గురువారం(Thursday) నాడు క‌ల్పవృక్ష వాహ‌నం – ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స‌ర్వభూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జరుగుతాయి. 22తారీఖు శుక్రవారం(Friday) నాడు మోహినీ అవ‌తారం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 గంట‌లకు ప్రారంభం అవుతాయి.. శనివారం 23వ తారీఖు నాడు-హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు కొనసాగుతాయి. స్వర్ణర‌థం – సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.. గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జరుగనున్నాయి.

ఇక 24వ తారీఖు – ఆదివారం(Sunday) రోజున – సూర్యప్రభ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్నప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు.. చంద్రప్రభ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జరుగుతాయి. 25 తేది సోమ‌వారం(Monday) నాడు- ర‌థోత్సవం- ఉద‌యం 6.55 గంట‌ల‌కు.. అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్నాయి. 26తారీఖు మంగ‌ళ‌వారం రోజు ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – ఉద‌యం 3 నుండి 6 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్నాయి. స్నప‌న‌తిరుమంజ‌నం, చ‌క్రస్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.. ధ్వజావ‌రోహ‌ణం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జరుగుతాయి.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News