మనం రోజంతా ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా చివరికి రాత్రికి ఇంటికి చేరుకుంటాం. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటాం. అందుకే ఇంటిని అందంగా, అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఇంటి కారణంగానే మన రోజువారీ జీవితం ఉంటుందని అనుకుంటారు. ఇంట్లో నెగటిఇ ఎనర్జీ దూరమై పాజిటివ్ వైబ్స్ కలగాలంటే కొన్ని టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. అవి మీకోసం..
ప్రవేశ ద్వారం
ఏ ఇల్లైనా సరే ముందుగా ఆకర్షించేది ప్రవేశద్వారమే. ఇది మంచి పాజిటీవ్ వైబ్ ని ఇస్తుంది. మీ ఎంట్రెన్స్ ఎంత బ్రైట్ గా , అందంగా ఉంటే అంత బాగుంటుంది. అదే విధంగా ఎప్పుడు కూడా ఎంట్రెన్స్ లో వెలుతురు ఉండేలా చూసుకోండి. అదే విధంగా ఇంటి గుమ్మం ముందు చెప్పులు, షూలు లేకుండా ఉండటం మంచిది.
సూర్యకాంతి..
సూర్యకాంతి ఒంటికే కాదు, ఇంటికి కూడా మంచిదని తెలుసుకోండి. సూర్యకాంతి ఉండడం వల్ల ఇల్లు ప్రకాశవంతంగా ఉంటుంది. దీంతో చుట్టూ ఉన్న జెర్మ్స్, నెగెటివిటీ దూరమవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మీ ఇంట్లోకి ఎండ వచ్చేలా చూసుకోవడం ఎంతో అవసరం.
అక్వేరియం..
చాలా మంది అక్వేరియాలను ఇంట్లో పెట్టుకుంటారు. ఇవి నిజానికి చాలా మంచిది. అయితే, ఈ చేపలు కూడా రంగురంగుల్లో ఉంటే చాలా బావుంటుంది. అదే విధంగా లివింగ్ రూమ్ లో అక్వేరియం పెడితే పాజిటీవిటీ పెరిగి సంపద పెరుగుతుందని చెబుతుంది.
ఇంట్లోని వస్తువులు..
ఇంట్లో రకరకాల వస్తువులు ఉంచుతాం. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచడం ఎంతో అవసరం. ప్రతి వస్తువుని ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేయాలి. వీటితో పాటు కిటికీలు, తలుపులు శుభ్రం చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది దూరమై పాజిటివిటీ పెరుగుతుంది.