తెలుగులో సహా ఇతర భాషల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలంటే యాక్షన్, కామెడీ, హార్రర్. హార్రర్ సబ్జెక్ట్‌ను డీల్ చేయడం అంత తేలికకాదు. ఇలాంటి హార్రర్ సినిమాలను ప్రారంభం నుంచి ఎండ్ కార్డ్ వరకు అదే టెంపోను మెయింటెన్ చేయగలగాలి. భయానక దృశ్యాలతో పాటు ఈ హారర్ సినిమాల్లో కాస్తంత కామెడీ కూడా జోడించిన సినిమాలు మంచి టాక్ ని సంపాదించుకున్నాయి. అలాంటి చిత్రాలలో కొన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
విరూపాక్ష
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ కు అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఉత్కంఠతకు గురిచేసే అంశాలు నిండిన థ్రిల్లర్ చిత్రమిది. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.
మసూద
చాలా కాలం తర్వాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చింది ‘మసూద’. ఈ చిత్రం కథ పాతదే అయినా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఢిఫరెంట్‌గా సాగుతుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో జరుగుతుంది. ఆత్మలను వదిలించడానికి పీర్ బాబాలు వచ్చి మసీదులో మంత్రాలు చదువడం మసూద భయానక దృశ్యాలు చూసే ప్రేక్షకుడిని భయపెడతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ ని అందుకుంది.
కాంచన, కాంచన-2
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ‘ముని’కి ‘కాంచన’, ‘కాంచన 2’ అఫీషియల్ సీక్వెల్స్. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా వసూళ్లు రాబట్టిన ‘ముని’ మినహా ఈ రెండు సీక్వెల్స్ సూపర్ హిట్ అయ్యాయి. లారెన్స్ కాన్సెప్ట్ దెయ్యాల వల్ల భయపడి, దెయ్యం పట్టి విచిత్రంగా ప్రవర్తించే యువకుడి గురించి. భయపడిన యువకుడి శరీరంలోకి ప్రవేశించిన దెయ్యం పగ తీర్చుకోవడమే సినిమా. భయానక క్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో ఉన్నాయి.
చంద్రముఖి 1 & 2
సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’. ఇది సీనియర్ యాక్టర్ విష్ణు వర్ధన్ నటించిన ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రానికి అధికారిక రీమేక్. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమా రాబోతోంది. దర్శక నటుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రేమకథా చిత్రమ్ 1 & 2
2013లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కినా హర్రర్ కామెడీ సినిమా “ప్రేమకథా చిత్రమ్” బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా నటించినప్పటికీ.. సప్తగిరి కామెడీ సినిమాకి ప్రధాన అసెట్‌గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ప్రేమకథా చిత్రమ్- 2 గా విడుదలైంది. ఈ సినిమాలో హారర్ సన్నివేశాలతో దర్శకుడు భయపెట్టినప్పటికీ అభిమానులను అలరించలేకపోయింది.
రాజు గారి గది 1 & 2 & 3
ఓంకార్ దర్శకత్వంలో 2015లో తెరకెక్కిన చిత్రం “రాజు గారి గది”. పూర్తిస్థాయి హర్రర్ కామెడి చిత్రంగా తెరకెక్కింది. ఆ తరువాత సీక్వెల్‌గా నాగార్జున, సమంత రూతు ప్రభ ప్రధాన పాత్రల్లో “రాజు గారి గది 2” విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. దీనికి మరో సీక్వెల్ గా ఓంకార్ దర్శకత్వంలోనే అవికా ఘోర్, ఆశ్విన్ బాబు ప్రధాన పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాగానే సక్సైయింది.