ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం (Vizianagaram)జిల్లాలో విషాదం(Tragedy) జరిగింది. జిల్లాలోని కొత్తవలస మండలం చింతలపాలెంలో వ్యవసాయ భూమిలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కుమార్తె మృతి చెందారు. ఎండి మోహినుద్దీన్ తన కుటుంబంతో కలిసి విశాఖ నగరం మర్రిపాలెం పరిధిలోని ఎఫ్సీఐ నగర్ లో నివాసం ఉంటున్నారు. సోమవార సాయంత్రం భార్య సంశినిషా, కుమార్తె ఫతిమా జహీధ, కుమారుడు అలీతో కలిసి కొత్తవలస సమీపంలోని చింతలపాలెంలో తమ స్థానం చూసేందుకు వెళ్లి అనంతరం అక్కడే బావిలో దూకారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, కుమార్తె చనిపోగా కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు.
వ్యవసాయ పొలాల(Agriculture field) మధ్యలోని ఓ బావిలో ఈ మృతదేహాలను గుర్తించిన చింతలపాలెం(Chinthalapalem) రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నీటిపై తేలుతున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయింది మహముద్దీన్ కుటుంబంగా పోలీసులు గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే, మృతులు మహముద్దీన్ కుటుంబంతో సహా క్యాబ్ లో వచ్చి కుమారుడు ఆలీకి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నాము అని లోకేషన్ పెట్టి సూసైడ్ నోట్ పెట్టి చనిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై కొత్తవలస(Kottavalasa) సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. అయితే, మహముద్దీన్ కుటుంబానిది హత్యా లేక ఆత్మహత్యా అన్నది తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు.