భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన వ్యాధుల్లో షుగర్ వ్యాధి ఒకటి. ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆనారోగ్యకరమైన జీవన విధానాల వల్ల షుగర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువ స్థాయిలో ఉంటే ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనే విషయాలు తెలుసుకుందాం.
షుగర్ వ్యాధి వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ దిలీప్ నందమూరి తెలియజేశారు. ఏ వయసు వారికైనా తరచూ ఆకలి, దప్పిక ఎక్కువ అవడం, మూత్రం రావడం వంటివి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి అని సూచించారు. అయితే థైరాయిడ్ సమస్యలు ఉన్నా అలాంటి లక్షణాలు ఉంటాయట. అందుకే డాక్టర్లను సంప్రదించి వ్యాధి నిర్ధరణ చేసుకోవాలని చెప్పారు.ఘగర్ తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలుంటాయి? దీని గురించి చూస్తే.. షుగర్ తక్కవగా ఉన్న వాళ్లకు చెమటలు పడ్డటం, చేతులు వణకడం, గాబరా/దడగా అనిపించడం, బరువు తక్కువగా ఉండటం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు.
“అయితే వీటిన జాగ్రత్తగా గమనించాలి. హైపర్ థైరాయిడ్, స్ట్రెస్, యాంగ్జైటీ వంటి కారణాలతో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం తగ్గినా దడ, నీరసంగా ఉంటారు. వీటిని నిర్ధరించుకోవడం కోసం సీబీపీ, థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. అయినా అలానే ఉంటే షుగర్ వ్యాధి నిర్ధరణ చేసుకోవాలి” అని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రేంజ్ 120 పైన, పోస్ట్ బ్లడ్ షుగర్ 140 పైన ఉంటే మధుమేహం ఉన్నట్టు నిర్ధరిస్తారని అంటున్నారు డాక్టర్ శివరాజు. దీంతో పాటు హెచ్‌బీఏ1సీ టెస్ట్ రేంజ్ 6.5 శాతం కన్నా ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధిగా నిర్ధరిస్తారు. అయితే షుగర్ స్థాయిలో హెచ్చు తగ్గులు వస్తే.. మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదని చెబుతున్నారు.