తెలుగు ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 7తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్బాస్ సందడి మొదలైందని చెప్పాలి. బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక తాజాగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్వారంటైన్ లేదు కానీ ఒకరోజు ముందు హౌస్ క్వారంటైన్ లోకి వెళ్ళాలని అంటున్నారు.
ఆగస్టు 31న బిగ్ బాస్ ఆధీనంలోకి వెళ్ళాలి. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో బిగ్ బాస్ షూట్ ఉంటుంది, ఆ రెండు రోజుల్లో ఒక్కొక్క కంటెస్టెంట్ లోపలికి వెళుతున్నట్టు షూట్ జరగనుంది. ఆ తరువాత దానిని సెప్టెంబర్ 3 రాత్రి 7 గంటల నుంచి మనకు టెలికాస్ట్ చేయనున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోని ఇంటీరియర్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి మూడు బెడ్ రూమ్స్ ఉండనున్నాయి. అందులో ఒకటి పూర్తిగా కెప్టెన్ కోసం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలుగు బిగ్ బాస్ సీజన్స్ లో ఇలా ఎప్పుడూ స్పెషల్ బెడ్ రూమ్ సెటప్ అయితే లేదు, ఈసారి మొట్టమొదటి సారిగా ప్లాన్ చేస్తున్నారు.
ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సీరియల్ నటుడు అమర్దీప్ చౌదరి, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి అంజలి పవన్, జీ తెలుగు గుండమ్మ కథ సీరియల్ నటి పూజ మూర్తి, ఇక సింగర్స్ కేటగిరీలో బాహుబలి ఫేమ్ దామిని భట్ల, భోలే షావలి, మోడల్ కేటగిరీలో ప్రిన్స్ యావర్, యాక్టర్ క్రాంతి, సీరియల్ నటి ప్రియాంక జైన్, జబర్దస్త్ టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, నటి ఫర్జానా, షకీలా, ఈటీవీ ప్రభాకర్, యాంకర్ ప్రత్యూష, రియాజ్, నటి శుభశ్రీ, నటుడు శివాజీ, అనిల్ గీల వంటి వారు హౌస్ లోపలి ఎంట్రీ ఇవ్వనున్నారు. నటుడు జబర్దస్త్ మహేష్ అలియాస్ ఆచంట మహేష్, మొగలిరేకులు ఆర్కే నాయుడు చివరి నిముషంలో డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.