ఆలూమగల మధ్య గోడవలు సాధారణం.ఏవో కారణాల చేత గొడవలు జరుగుతూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు(Wife Husband Issues) జరగడం, మళ్లీ కలిసిపోవడం సమాజంలో ప్రతి ఇంట్లో జరిగే సాధారణ సంఘటన. అసలు అలలు, గిల్లికజ్జాలు లేకుండా సంసారం సుఖంగా ఉండదని కూడా అంటారు. ఎన్ని గొడవలు వచ్చినా 10 నిమిషాలు కూర్చుని మాట్లాడితే సమస్యలు తీరతాయనేది వాస్తవం. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని జంటలు విచక్షణ కోల్పోతారు.
చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలనే పెద్ద విషయంగా తీసుకుని క్షణికావేశానికి లోనవుతున్నారు. వీరి గొడవలు పచ్చి సంగతులను నాశనం చేస్తూ.. విడాకుల వరకు వెళ్తున్నాయి. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల.. ఇంట్లో జరిగిన చిన్న గొడవతో ఓ యువతి భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రాజమహేంద్రవరానికి చెందిన రాజారావు కుటుంబం(Raja Rao Family) నగరానికి వలస వచ్చి జూబ్లీహిల్స్‌లో ఉంటోంది. అతని కుమారుడు రామచంద్ర (30) సాఫ్ట్‌వేర్ కంపెనీ(Software company)లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రామచంద్రకు 9 నెలల క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. చిన్న గొడవ జరిగినా అది చిలికి చిలికి గాలివాన అయ్యేది. అయితే అది గొడవలు 9 నెలల వరకు కొనసాగుతూనే వచ్చాయి. గొడవలతో విసిగి పోయిన భార్య అతడిని వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. గత మూడు నెలలుగా అత్తాపూర్ పరిధిలోని మారుతీనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు.
భార్యను తనవద్దకు రావాలని కోరేవాడు. అయితే భార్య రాలేనని కలాఖండిగా చెప్పేసింది. దీంతో భార్య వదిలేసి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అటు భార్య దగ్గర లేక, ఇట్టు మనస్తాపంతో తీవ్ర ఆలోచనతో గడపలేకపోయాడు. చావే సరణ్యమని భావించి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు తన భార్య వెళ్లిపోయిందని, రామచంద్ర చివరిగా ఎవరితో మాట్లాడు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.