దేశంలో పసిడి ధరలు (Gold Prices)గత వారం రోజులుగా హెచ్చుతగ్గులుగా కదలాడుతున్నాయి.బులియన్ మార్కెట్ లో బంగారం ధర కాస్త తగ్గింది. వెండి(Silver) ధర స్వల్పంగా పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,242 ఉండగా.. గురువారం రూ.192 తగ్గి రూ.61,050కి చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,947 ఉండగా.. గురువారం రూ.100 పెరిగి రూ.74,047కు చేరుకుంది. : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,047గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,050గా ఉంది. కిలో వెండి ధర రూ.74,047కు చేరుకుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,050గా ఉంది. కిలో వెండి ధర రూ.74,047గా ఉంది. ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,050గా ఉంది. కిలో వెండి ధర రూ.74,047కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు(gold rates) స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1932 డాలర్లుగా ఉండగా.. గురువారం 1928 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.15 డాలర్లుగా ఉంది. గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,41,899 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ రూ.22,41,899, ఇథీరియం రూ.1,34,501, టెథర్ రూ.83.3, బైనాన్స్ కాయిన్ రూ.17,815, యూఎస్డీ కాయిన్ రూ.83.6 గా ఉంది.
గురువారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణం. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 796 పాయింట్లు నష్టపోయి 67080 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 232 పాయింట్లు కోల్పోయి 19,901 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 లో పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, టాటా స్టీల్ కంపనీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.