తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(Skill development scam)లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబు(Chandrababu)తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురువారం సెంట్రల్ జైల్‌లో ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. టీడీపీ(TDP)తో పొత్తును ప్రకటించారు. ఈ విషయాన్ని జనసైనికులు అర్థం చేసుకోవాలని వారికి ఏవో కొత్త భ్రమలు కల్పించే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ(YSRCP)ని ఆపేందుకే టీడీపీతో పొత్తు అంటూ తన పాత పల్లవినే పాడారు.
దీనిపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. ‘నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం అని వైఎస్సార్‌సీపీ(YSRCP) స్పష్టం చేసింది.
మరోవైపు.. ఎన్నో రోజుల ఉత్కంఠకు, చర్చకు తెరపడింది. ఇంతకాలం టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? లేదా? అనే అంశానికి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెరదించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో వైసీపీకి ధీటుగా టిడిపి-జనసేన(TDP-Janasena) కార్యాచరణ మొదలుపెట్టనున్నాయి. అయితే చాలాకాలం నుంచి పొత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పవన్ మొదట నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని చెబుతున్నారు..కానీ పొత్తు ఉంటుందో లేదో క్లారిటీ రావడం లేదు.
మొత్తానికి పొత్తు అనేది ఇప్పుడు తేలింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో ఉన్న చంద్రబాబుని మూలాఖత్(Mulaqat) లో భాగంగా బాలయ్య, పవన్, లోకేష్ కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం బయటకొచ్చిన బాలయ్య, లోకేష్ తో కలిసి పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు అరెస్ట్‌ని ఖండిస్తూనే..ఆయనకు మద్ధతు తెలుపుతూ..జగన్ పై విరుచుకుపడ్డారు. ఇంతకాలం వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అనే చెప్పానని, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెబుతున్నానని టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని ప్రకటించారు.