ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో చనిపోయిన వ్యక్తి భార్యలుగా నమ్మించి దాదాపు నాలుగున్నర ఎకరాల (4.6 ఎకరాలు) భూమిని తమ పేరున రాయించుకున్నారు ఇద్దరు మహిళలు. ఈ విషయం వెలుగులోకి రావడం వల్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగ్పుర్ గ్రామంలో ప్రమోద్ కుమారుడు జగదీశ్ నివసిస్తున్నాడు. అతడి బాబాయి రామావతార్ 2021 జనవరి 4న మరణించాడు.
రామావతార్ భార్య ఇంద్రావతి ఇంకా బతికే ఉంది. ప్రస్తుతం ఆమె తన పుట్టింట్లో ఉంది. కాగా రామావతార్కు దాదాపు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది.అయితే ఆ భూమిని కాజేయాలని సాజ్ హాజీపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రామ్ ప్రకాశ్ భార్య హేమలత, శివలాల్ భార్య ఆర్తి పథకం వేశారు. వీరికి రామ్ ప్రసాద్ కుమారుడు ఓం ప్రకాశ్, బైరాగ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెచెలాల్ నివాసి వీరేంద్ర సింగ్ కుమారుడు శ్యామ్ సింగ్, ఖడ్సరియా అనే ముగ్గురు వ్యక్తులు సహాయం చేశారు. పథకంలో భాగంగా హేమలత, ఆర్తి.. రామావతార్ భార్యలుగా తమ పేరును రిజిస్టర్ చేయించుకున్నారు.
అనంతరం రామవతార్ భార్యలుగా సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూమిని తమ పేరున రాయించుకున్నారు హేమలత, ఆర్తి. అయితే తన బాబాయికి సంబంధించిన భూమిని అక్రమంగా ఇద్దరు మహిళలు చేజిక్కించుకున్నట్లు జగదీశ్ దృష్టికి వచ్చింది. దీంతో జగదీశ్ కిష్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశానుసారం హేమలత, ఆర్తి సహా ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.