ఆంధ్రప్రదేశ్ లో గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా.. ఈ సంవత్సరం ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్‌ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా పరీక్షలు నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్ఎస్సీ బోర్డు పరిగణిస్తారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇవ్వనున్నారు. ఇక మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉండనుంది.
Tenth:ఏపీ టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో ఇకపై ఏడు పేపర్లు
164
previous post