ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు లేఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఐటీ సంస్థలు లేఆఫ్‌లను ప్రకటించడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు సాంకేతిక రంగంలో వచ్చిన విఫ్లవాత్మకమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కూడా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఏర్పడింది. దేశంలో ఉన్న ఐటీ కంపెనీలు కూడా లేఆఫ్‌ను అమలు చేస్తున్నాయి. అయితే మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థకు చెందిన టెక్ మహీంద్ర మాత్రం తన కంపెనీలో ఉద్యోగాలను తీసేయకుండా ఏకంగా 8వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. వారికి ఏఐలో నైపుణ్యాలను నేర్పించింది. టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై హాట్ డిబేట్ సాగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల మెరుగైన భవిష్యత్‌కు ఐటీ ఉద్యోగులను సిద్ధం చేసే క్రమంలో సుమారు 8000 మందికి ఏఐలో శిక్షణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఆసక్తి పెరగడంతో పలు కంపెనీలు తమ దైనందిన కార్యకలాపాల్లో కొత్త టెక్నాలజీని వాడటం ప్రారంభించాయి.
ఏఐ నూతన కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ చాట్‌జీపీటీకి విశేష ఆదరణ లభించిన అనంతరం న్యూ టెక్నాలజీ పట్ల టెకీలతో పాటు కంపెనీల్లోనూ ఆసక్తి పెరిగింది. లేటెస్ట్‌గా టెక్ మహీంద్ర ఏఐపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా న్యూ టెక్నాలజీపై ఉద్యోగులు పట్టు సాధించేందుకు అవకాశం ఏర్పడింది. అమెరికా వంటి మార్కెట్లలో తమ కంపెనీ బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ రంగాల్లో దృష్టి సారించిందని, ఉద్యోగులను భవిష్యత్ టెక్నాలజీలపై పట్టు సాధించేలా వారిపై పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు టెక్ మహీంద్ర మార్కెటింగ్ హెడ్, గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్ష్‌వేంద్ర సోయిన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో తమ సంస్థ దాదాపు 8000 మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ, ఇతర ఏఐ ప్లాట్‌ఫాంలపై శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.