జీవో నెంబర్ 317(GO NUMBER 317) స్పౌజ్ బదిలీల(SPOUSE TRANSFERS) విషయంలో ఉపాధ్యాయులు(TEACHERS) మరోసారి పోరుబాట పట్టారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్(DEMAND) చేస్తూ.. ఉపాధ్యాయ దంపతులు(TEACHER COUPLES) చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్(EDUCATION COMMISSIONAR) కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్(LAKIDI KA POOL)లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్ ఫోరమ్ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయ దంపతులు చాలా మంది ధర్నాకు హాజరయ్యారు. అయితే గాంధీ జయంతి సందర్భంగా.. ఓవైపు కొందరు ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముందు మౌనదీక్షకు పూనారు.. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస హైదరాబాద్లో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఒక్కసారిగా ఉపాధ్యాయ దంపతులు వారి పిల్లలతో ర్యాలీ(RALLY)గా రావడంతో.. పోలీసులు వెంటనే అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించడంతో.. ఉపాధ్యాయ దంపతులు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని బలవంతంగా అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలామంది చిన్నారులు ఏడుస్తూ కనిపించారు.
ఉపాధ్యాయ దంపతులు.. పిల్లలతో సహా కమిషనర్ కార్యాలయం రోడ్డుపై బైఠాయించారు. గాంధీ(GANDHI) వేషధారణతో పిల్లలు.. గాంధీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలు చేతపట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో పాటు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో చిన్నారులపై సైతం పోలీసులు దారుణంగా ప్రవర్తించడంతో.. పిల్లలు, వారి తల్లిదండ్రులు విలపించారు. మరోపక్క కొంతమంది పోలీసులు చిన్నారులను చేరదీసి.. వారి తల్లిదండ్రులను లాక్కుంటూ వాహనాలలోకి ఎక్కించారు. ఈ తోపులాటలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 19 జిల్లాల్లో(19 DISTRICTS) బదిలీలకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం(STATE GOVERNMENT).. మరో 13జిల్లాల్లో ఆపేయడం న్యాయమా అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు.
వేర్వేరు చోట్ల విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ పిల్లలను సరిగా చూసుకోలేకపోతున్నామని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు. జీవో నెం 317 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని తమ సమస్యల్ని పరిష్కరించాలని.. లేదంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.