ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ 72 మంది పేర్లతో మొదటి జాభితా పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇది అధికారికంగా మరో 3, 4 నెలలు సమయం పట్టె అవకాశం ఉంది. ఎందుకంటే.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. బీజేపీ అధికారికంగా ప్రకటన చేయడానికి మరికొంత సమయం కావాలి. లోక్ సభ రద్దై ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది అధికారిక ప్రకటన జరుగుతుంది. అందువల్ల 72 మంది అభ్యర్థులను సిద్ధం చేసి మీరు సిద్ధం కండి. మీరు పోటీ చేయాలి మీరు తగు ఏర్పాటు చేసుకోండి అని ముందస్తుగానే అభ్యర్థులకు చెప్పారు. ఈ లీక్ ల వలన ఉపయోగం ఏంటంటే.. ప్రజలకు, ఓటర్లకు, నియోజక వర్గాల్లో ఎవరు పోటీ చేస్తున్నారో అనధికారికంగా వెళ్ళిపోతుంది. పొత్తులు ఖరారు కాకముందు మొదటి జాబితా ప్రకటించడం నైతిక ధర్మం కాదు గనుక ఈ విధంగా లీకుల రూపాన ప్రజలకు, ఆయా నియోజక వర్గాల్లో సమాచారం తెలుగు దేశం పార్టీయే కాదు అన్ని పార్టీలు ఈ విధంగానే సమాచారం అందిస్తాయి.
జనసేన కూడా ఇదే విధంగా లిస్టును సిద్ధం చేసుకుంది. లోక్ సభకు కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. జనవరి, ఫిబ్రవరి లోనే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు లోక్ సభతో పాటు మరో 10 రాష్ట్రాల శాసనసభతో కలిపి మినీ జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు 175 నియోజక వర్గాల్లో ఎక్కడెక్కడ తెలుగుదేశం ఎక్కడెక్కడ జనసేన ఎక్కడ బీజేపీకి అవకాశం కల్పించాలనే వ్యూహ రచనను పూర్తి చేశారు. అందరూ సిట్టింగ్ తెలుగు దేశం ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు కేటాయిస్తున్నారు. ఎవరైతే పార్టీ మారి వైఎస్ఆర్ సీపీ పార్టీకి జంప్ చేశారో వాళ్ళ స్థానాల్లో కొత్త అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. ఈ 72 నియోజక వర్గాలు ఎవరంటే..
1) ఇచ్ఛాపురం – బెందాలం ఆశోక్
2)టెక్కలి- అచ్చం నాయడు
3) ఆముదాలవలస – కూన రవి కుమార్
4) పలాస – గౌతు శిరీష
5) రాజాం – గోండు మురళి మోహన్
6) బొబ్బిలి – బేబీ నాయన
7)విజయనగరం – అశోక గజపతి రాజు
8) చీపురుపల్లి – కిమిడి నాగార్జున
9) కురూపం – జగదీశ్వరి
10) పార్వతీపురం – విజయచంద్ర
11) విశాఖ (ఈస్ట్) – వెళ్ళగపూడి రామకృష్ణ బాబు
12) విశాఖ (వెస్ట్) – గణబాబు
13)పాయకరావు పేట – వంగలపూడి అనిత
14) నర్సీపట్నం – చింతకాయల విజయ్
15) తుని – యనమల దివ్య
16) జగ్గంపేట – జ్యోతుల నెహ్రు
17) అనపర్తి – నల్లబెల్లి రామకృష్ణ రెడ్డి
18)రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు
19)గోపాలపురం – మద్దిపాటి వెంకట్ రాజు
20) ముమ్మడివరం – నాట్ల సుబ్బరాజు
21)అమలాపురం – అయితాబత్తుల ఆనంద్ రావు
22) మండపేట – వేగుల జోగేశ్వర రావు
23) ఆచంట – పితాని సత్యనారాయణ
24) పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
25)ఉండి – మంతెన రామరాజు
26)దెందులూరు – చింతమనేని ప్రభాకర్
27)విజయవాడ తూర్పు – గద్దె రామ మోహన్
28)విజయవాడ సెంట్రల్ – బోండా ఉమా మహేశ్వర రావు
29)నందిగామ – గంగిరాల్ సౌమ్య
30)జగ్గయ్యపేట – శ్రీరామ తాతయ్య
31)మచిలీపట్టణం – కోలు రవీంద్ర
32)గన్నవరం – యార్లగడ్డ వెంకట్ రావు
33)గుడివాడ – వెనిగండ్ల రాము
34)మంగళగిరి – నారా లోకేష్
35)పొన్నూరు – దులిపాల్ నరేంద్ర
36)చిలకలూరి పేట్ – పత్తిపాటి పుల్లారావు
37)సత్తెన్న పల్లి – కన్నా లక్ష్మి నారాయణ
38)వినుకొండ – జీ. వి ఆంజనేయులు
39) గురజాల – యరపతినేని శ్రీనివాసుల రావు
40)మాచెర్ల – జులకంటి బ్రహ్మానంద రెడ్డి
41)వేమూరు – నక్క ఆనంద్ బాబు
42)రేపల్లె – అనగాని సత్య ప్రసాద్
43)పరుచూరి – ఏలూరి సాంబశివరావు
44)అద్దంకి – గొట్టిపాటి రవి కుమార్
45)ఒంగోలు – దామచర్ల జనార్దన్
46)కొండెపి – డా. వీరాంజనేయులు స్వామి
47)కనిగిరి – డా. ఉగ్ర నరసింహ రెడ్డి
48)కొవ్వూరు (నెల్లూరు)- కొల్లం రెడ్డి దినేష్ రెడ్డి
49)నెల్లూరు సిటీ – పొంగులేటి నారాయణ
50)ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి
51)నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
52)శ్రీకాళహస్తి – బొజల సుధీర్ రెడ్డి
53)గాలి భాను ప్రకాష్
54)పలమనేరు – అమర్నాధ్ రెడ్డి
55)కుప్పం – నారా చంద్ర బాబు నాయుడు
56)పూతలపట్టు – మురళి మోహన్
57)పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
58)జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి
59)మైదుకూరు- బుట్ట సుధాకర్ యాదవ్
60)పులివెందుల – బీటేక్ రవి
61)బనగానపల్లి- బీ. సీ జనార్దన్ రెడ్డి
62)పాండ్యన్ – గౌరు చరితా రెడ్డి
63)కర్నూల్ – టీ. జీ భరత్
64)ఎమ్మగనూరు – జయ నాగేశ్వర రెడ్డి
65)రాప్తాడు – పరిటాల సునీత
66)రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు
67)ఉరవకొండ – పయ్యావుల కేశవ్
68)తాడిపత్రి – జేసీ అస్మిత రెడ్డి
69)కళ్యాణదుర్గం – ఉమామహేశ్వర నాయుడు
70)హిందూపురం – నందమూరి బాలకృష్ణ
71)కదిరి- కందికుంట వెంకట్ ప్రసాద్
72)ధర్మవరం – పరిటాల శ్రీ రామ్